For Money

Business News

శ్రీకృష్ణ జ్యువెల్లరీలపై ఈడీ సోదాలు

హైదరాబాద్‌లోని శ్రీ కృష్ణ జ్యువెలరీ షాపులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ దాడులు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో పలు చోట్ల ఉన్న షాపులపై బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇది వరకు ఈ కంపెనీ యజమానులను సీబీఐ అధికారుల అరెస్ట్‌ చేశారు. 1,100 కిలోల బంగారం అక్రమంగా రవాణా చేస్తుండగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌తో సహా నలుగురుని అప్పట్లోనే అరెస్ట్‌ చేశారు. అక్రమంగా దిగుమతి చేసుకుని స్థానిక మార్కెట్లలో అమ్ముతున్నారని సీబీఐ గుర్తించింది. రావిర్యాల్‌లోని కంపెనీ ఎస్‌ఈజడ్‌లో అక్రమాలు నిజమని గుర్తించారు. నగలు తయారు చేసి విదేశాలకు ఎగుమతికి చేసేందుకే ఎస్‌ఈజడ్‌కు అనుమతి ఉంది, కాని కంపెనీ విరుద్ధంగా ఇక్కడ తయారు చేసిన నగలను స్థానిక మార్కెట్లలోనే విక్రయించినట్లు గుర్తించారు.