For Money

Business News

దిగువ స్థాయిలో అందిన మద్దతు

ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 14,151 వద్ద నిఫ్టికి మద్దతు అందింది. మిడ్‌ సెషన్‌ వరకు క్రమంగా నష్టాలను పూడ్చుకున్న నిఫ్టి ఆ తరవాత ఒకట్రెండు సార్లు నష్టాల్లోకి జారినా.. వెంటనే కోలుకుంది. యూరో మార్కెట్ల ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి కూడా క్రమంగా కోలుకుని 14,424 పాయింట్లను తాకింది. దిగువ స్థాయి నుంచి ఏకంగా 300 పాయింట్ల దాకా కోలుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 109 పాయింట్లు పెరిగి 14,4016 స్థాయి వద్ద ముగిసింది. ఉదయం సింగపూర్‌ నిఫ్టి ట్రేడైన స్థాయిలోనే నిఫ్టి ముగిసింది. స్టీల్‌, ఐటీ షేర్లకు తోడు బ్యాంక్‌ నిఫ్టి కూడా రెండు శాతంపైగా పెరగడంతో నిఫ్టి నిలబడగలిగింది. అయితే నిఫ్టి నెక్ట్స్‌ 50, మిడ్‌ క్యాప్‌ షేర్లలో అంత జోష్‌ లేదు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
విప్రో 486.50 3.49
ఐసీఐసీఐ బ్యాంక్‌ 578.40 3.45
టాటా స్టీల్‌ 922.50 3.19
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 639.05 2.97
హెచ్‌డీఎఫ్‌సీ 2,478.05 2.57

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
శ్రీసిమెంట్‌ 28,509.15 -2.77
టైటాన్‌ 1,481.85 -2.70
టాటా కన్జూమర్‌ 667.05 -1.92
హిందుస్థాన్‌ లీవర్‌ 2,352.30 -1.88
నెస్లే ఇండియా 16,789.90 -1.79