For Money

Business News

అంచనాలను మించి ఫలితాలు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.18,951 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది మార్కెట్‌ అంచనాలకంటే అధికంగా. ఆయిల్‌, పెట్రో కెమికల్‌ వ్యాపారం కోలుకోవడం.. టెలికాం, బిజినెస్‌ వ్యాపార విభాగాలు రాణించడంతో దాదాపు లాభం దాదాపు క్రితం ఏడాది స్థాయిలోనే ఉంది. కంపెనీ ఆదాయం మాత్రం 11 శాతం మేర పెరిగింది. ఈ త్రైమాసికంలో రూ.2.64 లక్షల కోట్ల ఆదాయాన్ని కంపెనీ వెల్లడించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.69,621 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది నికర లాభం రూ.66,702 కోట్లు.
ఈసారి కూడా రిలయన్స్‌ జియో అద్భుత పనితీరు కనబర్చింది. టెలికాం విభాగం ఈ త్రైమాసికంలో రూ.5,337 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,716 కోట్లతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. అలాగే రూ.25,959 కోట్ల ఆదాయం వచ్చినట్లు జియో తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జియో నికర లాభం రూ.20,466 కోట్లు కాగా, ఆదాయం రూ.1,00,119 కోట్లు. కూల్‌ డ్రింక్‌ విభాగంలో ప్రవేశించిన రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ విభాగం బాగా రాణించింది. క్యాంపా కోలా అమ్మకాల ద్వారా రూ. 400 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. పూర్తి ఏడాదికి కంపెనీ రూ. 700 కోట్ల ఆదాయం గడించే అవకాశముంది.

Leave a Reply