For Money

Business News

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్న మన మార్కెట్‌ నష్టాల్లో ఉంది. ఉదయం ఓపెనింగ్‌లోనే 14,319 పాయింట్లకు చేరిన నిఫ్టి ప్రస్తుతం 39 పాయింట్ల నష్టంతో 14,367 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. పైకి నిఫ్టి స్వల్ప లాభాల్లో ఉన్నా మెజారిటీ షేర్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. నిఫ్టిలో 28 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి కూడా నష్టాల్లో ఉంది. రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా నాస్‌డాక్‌ ఒక శాతం దాకా నష్టపోయింది. ఫ్యూచర్స్‌లో దమ్ము లేదు. యూరో మార్కెట్లు కూడా ఇవాళ డల్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. మరికాస్సేపట్లో అధికారికంగా కోవిడ్‌ కేసుల డేటా వెలువడనుంది. 3.3 లక్షలకు పైగా కేసులను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి వస్తుంది… లేదా నిన్నటి లాగా చివరి దాకా స్వల్ప లాభాల్లోనైనా కొనసాగుతుందా అన్నది చూడాలి. అనలిస్టులు మాత్రం పెరిగితే అమ్మమనే సలహా ఇస్తున్నారు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
పవర్‌గ్రిడ్‌ 211.10 3.76
ఎస్‌బీఐ లైఫ్‌ 938.45 2.63
టాటా స్టీల్‌ 941.30 2.16
ఏషియన్‌ పెయింట్స్‌ 2,556.65 1.81
గ్రాసిం 1,319.55 1.49

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఐసీఐసీఐ బ్యాంక్‌ 570.10 -1.57
హెచ్‌డీఎఫ్‌సీ 2,449.45 -1.22
బజాజ్‌ ఫైనాన్స్‌ 4,632.00 -1.21 మారుతీ 6,577.50 -1.09
హిందుస్థాన్‌ లీవర్‌ 2,324.30 -1.07