For Money

Business News

కోలుకున్నా… నష్టాల్లో ముగిసిన నిఫ్టి

ఉదయం నష్టాల నుంచి కోలుకున్న నిఫ్టి మిడ్ సెషన్‌కల్లా 14,461 పాయింట్లకు చేరుకుంది. మిడ్ సెషన్‌ తరవాత ప్రారంభమైన నిఫ్టి నష్టాల్లోకి జారుకోవడంతో మన మార్కెట్‌లో కూడా ఒత్తిడి వచ్చింది. ఒకదశలో 14,273 పాయింట్లకు పడిపోయిన నిఫ్టి క్లోజింగ్‌కల్లా కాస్త కోలుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే 65 పాయింట్ల నష్టంతో 14,341 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్‌ షేర్లలో వచ్చిన భారీ నష్టాలతో మార్కెట్‌ రెడ్‌లో ముగిసింది. మిడ్‌ క్యాప్‌ సూచీ మాత్రం స్థిరంగా ముగిసింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎన్‌టీపీసీ 102.85 3.94

పవర్‌గ్రిడ్‌ 210.90 3.66
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 689.95 1.61
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 848.00 1.47
బీపీసీఎల్‌ 423.20 1.16

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బ్రిటానియా 3,651.80 -2.67
ఎం అండ్‌ ఎం 779.50 -2.53
డాక్టర్‌ రెడ్డీస్‌ 5,075.00 -2.40
విప్రో 475.40 -2.31
ఐసీఐసీఐ బ్యాంక్‌ 567.50 -2.02