For Money

Business News

నిఫ్టి… పెరిగితే అమ్మండి

సింగపూర్‌ నిఫ్టి ప్రస్తుతం 140 పాయింట్ల లాభంతో ఉంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతోంది. జపాన్‌, హాంగ్‌సెంగ్‌లు మాత్రం నామ మాత్రపు లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి గనుక సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో ప్రారంభమయ్యే పక్షంలో నిఫ్టిని 14450-14500 ప్రాంతం మధ్యలో 30 పాయింట్ల స్టాప్‌ లాస్‌తో అమ్మాల్సిందిగా టెక్నికల్‌ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మాత్రం నిఫ్టి కొనుగోళ్ళకు దూరంగా ఉండటం మంచిది. నిఫ్టి గనుక లాభాలతో ప్రారంభమైతే.. ఎగువ స్థాయిలో నిఫ్టిని ఎలాంటి స్థితిలోనూ కొనుగోలు చేయొద్దనే అనలిస్టులు సలహా ఇస్తున్నారు.