For Money

Business News

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.4,403 కోట్లు

ఐసీఐసీఐ బ్యాంక్‌.. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.4,403 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్‌ ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.1,221 కోట్లుగా ఉంది. తాజా త్రైమాసికంలో బ్యాంక్‌ ఆదాయం రూ.23,443.66 కోట్ల నుంచి రూ.23,953 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 5.53 శాతం నుంచి 4.96 శాతానికి పడిపోయాయి. నికర ఎన్‌పీఏలు కూడా 1.41 శాతం నుంచి 1.41 శాతానికి తగ్గాయి. కాగా మొండి బకాయిలు, కంటిజెన్సీల కోసం చేసిన కేటాయింపులు కూడా రూ.5,967.44 కోట్ల నుంచి రూ.2,888.47 కోట్లకు తగ్గినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ వెల్లడించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదిన మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ నికర ఆదాయం రూ.43,621 కోట్లుగా ఉండగా నికర లాభం రూ.4,881 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్‌ 3.87 శాతం నుంచి 3.84 శాతానికి తగ్గిందని బ్యాంక్‌ పేర్కొంది.