For Money

Business News

14,450పైన ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమైంది. బ్యాంక్‌ నిఫ్టితో పాటు సిమెంట్‌ కంపెనీలకు మంచి మద్దతు లభించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆకర్షణీయ లాభాలను ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్‌ 4 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ఇలాగే యాక్సిస్‌, ఎస్‌బీఐ బ్యాంకులు కూడా. నిఫ్టి 43 షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ప్రస్తుత స్థాయి నుంచి ఎంత వరకు పెరుగుతుందో చూడాలి. ప్రస్తుతం 137 పాయింట్ల లాభంతో 14,478 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి ఇంకాస్త పెరుగుతుందేమో చూడాలి. 14,500 ప్రాంతానికి వస్తే 14,530 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మడమే బెటర్‌ అని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. 14,530 పైన నిఫ్టికి గట్టి ప్రతిఘటన రావడం ఖాయంగా కన్పిస్తోంది. యూరో మార్కెట్లు ప్రారంభమయ్యే లోపు నిఫ్టి కాస్త ఒత్తిడి రావొచ్చు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఐసీఐసీఐ బ్యాంక్‌ 593.40 4.11
ఓఎన్‌జీసీ 105.15 2.69 యాక్సిస్‌ బ్యాంక్‌ 687.20 2.36
ఎస్‌బీఐ 344.15 2.29
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 6,165.00 1.60

నిఫ్టి టాప్ లూజర్స్‌
హెచ్‌సీఎల్‌ టెక్‌ 931.25 -2.55 బ్రిటానియా 3,588.70 -1.69 సిప్లా 925.95 -1.03 డాక్టర్‌ రెడ్డీస్‌ 5,051.55 -0.30 పవర్‌గ్రిడ్‌ 210.65 -0.24