నిస్తేజంగా వాల్‌స్ట్రీట్
అమెరికా మార్కెట్లు తీవ్ర అయోమయంలో ఉన్నాయి. ఇటీవల భారీగా క్షీణించిన మార్కెట్లు కోలుకోలేకపోతున్నాయి. ప్రస్తుత స్థాయిల వద్ద నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లకు ద్రవ్యోల్బణం పెద్ద సమస్యగా మారింది. దీంతో ఇవాళ వాల్‌స్ట్రీట్ కొద్దిసేపు నష్టాల్లో, కొద్ది లాభాల్లో ఉంటూ… దాదాపు క్రితం స్థాయిలో వద్దే ట్రేడవుతోంది. మరోవైపు డాలర్ కరెన్సీ ఇవాళ కూడా గ్రీన్‌లో ఉంది. క్రూడ్ ధరలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు, బులియన్ మాత్రం గ్రీన్‌లో ఉండటం విశేషం.