For Money

Business News

తెలంగాణలో నిరుద్యోగ రేటు 3.8%

దేశంలోనే నిరుద్యోగ రేటు అత్యల్పంగా ఉన్న రాష్ట్రంగా చత్తీస్‌ఘడ్‌ రికార్డు సృష్టించింది. గత ఏడాది సెప్టెంబర్‌ – డిసెంబర్‌ మధ్య కాలంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటుకు సంబంధించిన డేటాను సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామి (CMIE) వెల్లడించింది. చత్తీస్‌ఘడ్‌లో నిరుద్యోగ రేటు కేవలం 0.6 శాతం మాత్రేమేనని పేర్కొంది. రెండోస్థానంలో ఒరిస్సా (1.5 శాతం) మూడో స్థానంలో మేఘాలయ (1.8 శాతం) నిలిచింది. ఇక దేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్న రాష్ట్రంలో 25.7 శాతంతో హర్యానా చిట్ట చివరి స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ 3.8 శాతం నిరుద్యోగ రేటుతో 8వ స్థానంలో ఉండగా, 5 శాతం నిరుద్యోగ రేటుతో ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానంలో ఉంది. 25.7 శాతం నిరుద్యోగ రేటుతో హర్యానా చివరి స్థానంలో ఉండగా, రాజస్థాన్‌లో 24.5 శాతం, జమ్మూ కాశ్మీర్‌ 22.8 శాతం దిగువ నుంచి మూడు స్థానాల్లో ఉన్నాయి.