For Money

Business News

26 శాతం పెరిగిన ట్విటర్‌ షేర్‌

ట్వీటర్‌ కంపెనీలో 9.2 శాతం వాటాను టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేశారన్న వార్తతో ఆ షేర్‌ ఇవాళ 26 శాతం లాభంతో ప్రారంభమైంది. దీంతో ఇతర సూచీలు నష్టాల్ల ప్రారంభమైనా నాస్‌డాక్‌ దాదాపు ఒక శాతం లాభంతో ప్రారంభమైంది. ఒకదశలో 49.77 డాలర్లకు చేరిన ట్విటర్‌ షేర్‌ ఇపుడు 47.96 శాతం అంటే 21.78శాతం లాభంతో ఉంది. షేర్ల కొనుగోలుతో ట్విటర్‌లో ఎలాన్‌ మస్క్‌ అతి పెద్ద వ్యక్తిగత ఇన్వెస్టరుగా మారాడు. అమెరికాలో లిస్టయిన చైనా కంపెనీల ఏడీఆర్‌లు కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి. డౌజోన్స్‌ 0.47 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 దాదాపు క్రితం ముగింపు వద్దే ఉంది. డాలర్ ఇండెక్స్‌ 98.89కి చేరింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశముందని వార్తలు రావడంతో బ్రెంట్‌ క్రూడ్ మళ్ళీ మూడు శాతం పెరిగి 108 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.