For Money

Business News

స్విగ్గి, జొమాటొపై దర్యాప్తు

జొమాటొ, స్విగ్గీ కంపెనీలు తమ పోటీ లేకుండా కొన్ని పద్ధతులు పాటిస్తున్నాయంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆదేశించింది. ఈ కంపెనీలపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవమున్నట్లు కన్పిస్తోందని… ఈ వ్యవహారంపై 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా డిప్యూటీ జనరల్‌ను సీసీఐ ఆదేశించింది. స్విగ్గి, జొమాటోలు మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తూ… తమ స్థానాన్ని దుర్వినియోగ పరుస్తున్నాయని ద నేషనల్‌ రెస్టారెంట్ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (NRAI) గత ఏడాది సీసీఐకు ఫిర్యాదు చేసింది. మార్కెట్‌లో తమకు ఉన్న గుత్తాధిపత్యాన్ని అడ్డంగా పెట్టుకుని రెస్టారెంట్లతో ఏక పక్ష ఒప్పందాలు చేసుకుంటున్నాయని, భారీ కమిషన్‌ వసూలు చేయడంతో పాటు గేట్‌వే చార్జీలు కూడా వసూలు చేస్తున్నాయని NRAI ఆరోపించింది.