For Money

Business News

టాటా మోటార్స్‌: EVల కోసం కొత్త కంపెనీ

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కోసం కొత్త అనుబంధ కంపెనీని ఏర్పాటు చేయాలని టాటా మోటార్స్‌ నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలో టీపీజీ రైజ్‌ కంపెనీకి 11 శాతం నుంచి 15 శాతం వాటా కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం టీపీజీ రైజ్‌ కంపెనీ రూ. 7500 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ మొబిలిటీ వ్యాపారాన్ని విస్తరించడానికి తమతో టీపీజీ రైజ్ జతకలవడం సంతోషంగా ఉందని టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. భారత ప్రభుత్వం 2030 నాటికి కార్లలో కనీసం 30% ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా ప్రణాళికలను రూపొందించిందని, ఇందులో తమవంతు పాత్ర పోషించడానికి సిద్దంగా ఉన్నామని ఆయన అన్నారు. 2025 నాటికి 10 కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను(బీఈవీలు) తీసుకురావలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.