For Money

Business News

డీలిస్టింగ్‌… 20 శాతం అప్‌

డిజిటల్‌ సర్వీసెస్‌, ప్రొడక్ట్ ఇంజినీరింగ్‌ కంపెనీ అయిన ఆర్‌ సిస్టమ్స్‌లో ప్రముఖ పీఈ కంపెనీ బ్లాక్‌స్టోన్‌ మెజాఇటీ వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ. 2904 కోట్లు. ప్రమోటర్లు కూడా తమకు ఉన్న 52 శాతం వాటాను కూడా అమ్ముకుంటున్నారు. ప్రమోటర్ల నుంచి బ్లాక్‌ స్టోన్‌ రూ. 245 ధరకు కొనుగోలు చేయనున్నారు. డీల్ కుదిరిననాటి ధర రూ. 235.8తో పోలిస్తే 3.9 శాతం ప్రీమియంతో కొనుగోలు చేసింది. ప్రమోటర్లకు డీల్‌లోరూ. 1496 కోట్లు లభిస్తాయి. ఈ షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్ చేయాలని బ్లాక్‌స్టోన్‌ నిర్ణయిచింది. దీనికిగాను ఇన్వెస్టర్లకు రూ. 246 ధరకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటింనుంది. బ్లాక్‌స్టోన్‌ డీల్ వ్యవహారం వెలువడిన వెంటనే ఆర్‌ సిస్టమ్స్ షేర్‌ 20 శాతం పెరిగింది. ఈ షేర్‌ క్రితం ముగింపు ధర రూ. 235 కాగా… ఓపెనింగ్‌లోనే రూ. 282ని తాకింది. ఇపుడు 17 శాతం లాభంతో రూ. 275 వద్ద ట్రేడవుతోంది.