For Money

Business News

10 శాతం క్షీణించిన పేటీఎం

బ్లాక్‌డీల్‌ కారణంగా పేటీఎం షేర్‌ ఇవాళ ఓపెనింగ్‌లోనే పది శాతం క్షీణించింది. రెండు రోజుల్లో ఈ షేర్‌ దాదాపు 14 శాతం క్షీణించింది. నిన్న ఈ షేర్‌ రూ. 601.45 వద్ద క్లోజ్‌ కాగా, ఇవాళ ఓపెనింగ్‌లో రూ. 562.75ఉన్నా… వెంటనే రూ. 541.40ని తాకింది. అంటే పది శాతం క్షీణించిందన్నమాట. వెంటనే స్వల్ప మద్దతు అందడంతో ఈ షేర్‌ ఇపుడు రూ. 548 వద్ద అంటే 9 శాతం నష్టంతో ట్రేడవుతోంది. దాదాపు నాలుగు శాతం వాటాను ఇవాళ సాఫ్ట్‌ బ్యాంక్‌ విక్రయించింది. భారీ నష్టాలతో ఈ షేర్‌ను సాఫ్ట్‌ బ్యాంక్‌ అమ్మినట్లు తెలుస్తోంది. దిగువ స్థాయిలో ఇవాళ మద్దతు అందుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఈ ఏడాది మేలో ఈ షేర్‌ రూ. 510ని తాకింది. మార్కెట్‌ డల్‌గా ఉన్నందున మున్ముందు ఒత్తిడి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.