For Money

Business News

నష్టాలతో నిఫ్టి ప్రారంభం

సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి కూడా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18379ని తాకిన నిఫ్టి ఇపుడు 18374 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 35 పాయింట్లు నష్టంతో ట్రేడవుతోంది. అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి.అయితే నష్టాలన్నీ నామమాత్రంగానే ఉన్నాయి. వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడంతో నిఫ్టిలో హెచ్చుతగ్గులకు ఛాన్స్‌ ఉంది. నిఫ్టి స్వల్ప నష్టాల్లో ఉన్నా… అనేక షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. జాగ్వార్‌ సీఈఓ రాజీనామా చేయడంతో టాటా మోటార్స్‌ మూడు శాతం దాకా నష్టపోయింది. పేటీఎం, నైకాల నష్టం ప్రభావం నిఫ్టి నెక్ట్స్‌పై చాలా ఉంది. అశోక్‌ లేల్యాండ్‌ రెండు శాతంపైగా క్షీణించినా.. శ్రీరామ్ ట్రాన్స్‌ పోర్ట్‌ నాలుగు శాతం లాభపడటంతో నిఫ్టి మిడ్‌క్యాప్‌ సూచీ స్థిరంగా ఉంటోంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఒక శాతం క్షీణించినా… బ్యాంక్‌ నిఫ్టి దాదాపు గ్రీన్‌లోకి వచ్చేలా ఉంది. వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా ఇవాళ దిగువస్థాయిలో మద్దతు లభిస్తుందేమో చూడాలి. పది గంటల సమయంలో డే ట్రేడర్స్‌కు మంచి ఛాన్స్‌ లభించవచ్చు.