For Money

Business News

18750 దిగువన నిఫ్టి

నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18734ను తాకింది. నిఫ్టి డే ట్రేడర్స్‌కు మంచి ఛాన్స్‌ ఇచ్చింది. నిఫ్టి స్టాప్‌లాస్‌ను తాకినా వెంటనే కోలుకుంది. ఇపుడు మద్దతు స్థాయి 18750 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 62 పాయింట్లు క్షీణించింది. నిఫ్టి మిడ్‌క్యాప్‌లో పెద్దగా ఒత్తిడి లేదు. అలాగే నిఫ్టి నెక్ట్స్‌పై కూడా. నిఫ్టిలో 36 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి షేర్ల విషయానికొస్తే ఓఎన్‌జీసీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. వైండ్‌ ఫాల్‌ ట్యాక్స్‌ను సగానికి తగ్గించడంతో ఈ షేర్‌తో పాటు రిలయన్స్‌ కూడా పెరిగింది. ఐషర్‌ మోటార్స్‌ 2 శాతం నష్టంతో నిఫ్టి టాప్‌ లూజర్‌గా నిలిచింది. రియాల్టి షేర్లకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. పేటీఎం ఇవాళ కూడా ఆకర్షణీయంగా లాభపడింది. మిడ్‌ క్యాప్‌ ఇవాళ బాగానే రాణిస్తోంది. ఆస్ట్రాల్‌ చాలా రోజుల తరవాత రెండు శాతంపైగా పెరిగింది. బ్యాంక్‌ షేర్లలో బంధన్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.