For Money

Business News

న్యూఏజ్‌ షేర్లు కళకళ

ఒక్కో షేర్‌ 50 శాతం నుంచి 75 శాతం వరకు పడిన తరవాత న్యూఏజ్ షేర్లలో కొనుగోళ్ళ ఆసక్తి కన్పిస్తోంది. అనేక మంది యాంకర్‌ ఇన్వెస్టర్లు తమ వాటాలను అమ్ముతున్నా… వెంటనే కొనుగోలు దారులు దొరుకుతున్నారు. దిగువ స్థాయిలో గట్టి మద్దతు అందడానికి ప్రధాన కారణం… అమెరికా మార్కెట్లలో నాస్‌డాక్‌కు దిగువ స్థాయిలో కోలుకోవడం. ఇక్కడి నుంచి నాస్‌డాక్‌ పతనం ఉండకపోవచ్చన్న విశ్లేషకుల అంచనాతో మన దేశంలో కూడా ఐటీ,టెక్‌, న్యూఏజ్‌ షేర్లకు మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లలో భారీ ర్యాలీ కన్పిస్తోంది. ఇక న్యూఏజ్‌ షేర్ల విషయానికి వస్తే చాలా మంది అనలిస్టులు పేటీఎంను రెకెమెండ్‌ చేస్తున్నారు. ఈ షేర్‌ రూ.450 ప్రాంతంలో చాలా మంది అనలిస్టులు కొనుగోలు చేయాలని సూచించారు. కొన్ని సంస్థలు ఏకంగా రూ.1000 టార్గెట్‌ ఇస్తున్నారు. మార్కెట్‌ పడినా ఇవాళ కూడా పేటీఎం 3 శాతం దాకా లాభపడింది. అలాగే నైకా షేర్‌. గత కొన్ని రోజుల నుంచి కొద్ది కొద్దిగా ఈ షేర్‌ లాభపడుతోంది. ఇక జొమాటో కూడా. కాని ఇవాళ పీబీ ఫిన్‌ టెక్‌కు గట్టి మద్దతు లభిస్తోంది. ఈ షేర్‌లో 5 శాతం ఈక్విటీ చేతులు మారుతోంది. అయినా ఈ షేర్‌ ఒకదశలో ఆరు శాతం దాకా పెరిగింది. ఇపుడు మూడు శాతం లాభంతో ఉంది. గత ఏడాది కాలంలో స్టాక్‌ మార్కెట్‌లోకి వచ్చి భారీగా క్షీణించిన కొత్త షేర్లను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చు.