For Money

Business News

18,850పైన నిఫ్టి

నిఫ్టి ఓపెనింగ్‌లోనే వంద పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. 18874 పాయింట్లను తాకిన తరవాత ఇపుడు 18867 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 109 పాయింట్ల లాభంతో ఉంది. సెన్సెక్స్‌ 393 పాయింట్లు లాభపడింది. అయితే ఇది పూర్తిగా నిఫ్టి ఆధారిత ట్రేడింగ్‌లా కన్పిస్తోంది. ఎందుకంటే నిఫ్టిలో మినహా మిగిలిన సూచీల్లో పెద్ద మార్పు లేదు. నిఫ్టి బ్యాంక్‌ బ్యాంక్‌ ఒక్కటే అర శాతం లాభంతో ఉంది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో అస్సలు కదలిక లేదు. నిఫ్టిలో 34 షేర్లు లాబాల్లో ఉన్నాయి. ఊహించినట్లే మెటల్స్‌, ఐటీ షేర్లలో ర్యాలీ కన్పిస్తోంది. హిందాల్కో మినహా నిఫ్టిలోని టాప్‌ 5లో అన్ని ఐటీ షేర్లే. నష్టపోయిన నిఫ్టి షేర్లలో బజాజ్‌ ఆటో ముందుంది. ఈ షేర్‌ 2.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఐటీ మిడ్‌ క్యాప్‌ షేర్లు కూడా వెలుగులో ఉన్నాయి. నిఫ్టి క్యాప్‌లో పెద్ద మార్పులు లేవు. అన్నీ క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. ఇక బ్యాంకు షేర్లలో మిడ్‌ క్యాప్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ప్రైవేట్‌ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఒక శాతంపైగా లాభంతో ఉంది. ప్రభుత్వ వ్యాపారం చేసేందుకు అనుమతి ఇవ్వడంతో తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ షేర్‌ ఇవాళ లాభాల్లో ట్రేడవుతోంది.