For Money

Business News

TMB: ఐపీఓ ఇన్వెస్టర్లు ఖుష్‌

తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ (టీఎంబీ) పబ్లిక్‌ ఆఫర్‌లో షేర్లు కొన్న ఇన్వెస్టర్లు ఊపిరిపీల్చుకున్నారు. ఈ బ్యాంక్‌కు సంబంధించి కొన్ని షేర్లపై యాజమాన్యం హక్కుపై గొడవ నడుస్తోంది. పైగా ఆర్బీఐ నుంచి పలు వ్యాపారాలకు అనుమతి పెండింగ్‌లో ఉంది. దీంతో అన్ని బ్యాంకుల షేర్లు పెరిగినా టీఎంబీ మాత్రం లిస్టింగ్‌ ధరకు దిగువనే ఉంటూ వచ్చింది. సెప్టెంబర్‌ 15న లిస్టయిన ఈ షేర్‌ ధర అక్టోబర్‌లో రూ.463ని తాకింది. అక్కడి నుంచి రూ. 500లకు చేరుకుంది కాని ఆఫర్‌ ధరను దాటలేదు. నిన్న ప్రభుత్వ బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించేందుకు ఆర్బీఐ అనుమతి ఇవ్వడంతో ఈ షేర్‌ ఇవాళ ఆరు శాతంపైగా పెరిగి రూ. 542ను దాటింది. ప్రస్తుతం రూ. 534 వద్ద ట్రేడవుతోంది. లిస్టింగ్‌ తరవాత దిగువస్థాయిలో కొన్న ఇన్వెస్టర్లకు మంచి ప్రతిఫలం అందింది. ఇక నుంచి ఈ బ్యాంకు షేర్‌ కూడా మిడ్‌ క్యాప్‌ షేర్లలో కీలక పాత్ర వహించే అవకాశముంది.