For Money

Business News

లాభాలు స్వీకరించినా… లాభాల్లోనే

వీక్లీ సెటిల్‌మెంట్‌ ప్రభావంతో పాటు యూరో మార్కెట్లు నీరసం కారణంగా నిఫ్టి అధిక స్థాయిల వద్ద నిలబడ లేకపోయింది. ఉదయం 18887 పాయింట్లను తాకిన నిఫ్టి మిడ్‌ సెషన్‌ కల్లా చల్లబడింది. ఆరంభంలో యూరో మార్కెట్లు ఒక మోస్తరు లాభాలు ఉన్న క్రమంగా తగ్గుతూ వచ్చాయి. పైగా మన మార్కెట్‌లో వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడంతో చాలా మంది ట్రేడర్లు లాభాలు స్వీకరించారు. నిఫ్టి ఒకదశలో 18778 పాయింట్లకు వెంటనే కోలుకుని 18812 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 54 పాయింట్లు లాభపడింది. బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ చల్లబడి పోయింది. ఈ సూచీ నుంచి ఎలాంటి మద్దతు అందలేదు. పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి షేర్లు భారీగా లాభపడినా.. బ్లూచిప్‌ షేర్లలో అధిక ఒత్తిడి వచ్చింది. అలాగే నిన్న రాత్రి నాస్‌డాక్‌ పెరిగినా… ఆ ఉత్సాహం మన బ్లూచిప్‌ ఐటీ షేర్లలో కన్పించలేదు. మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లు మాత్రం బాగా లాభపడ్డాయి. పలు షేర్లు నాలుగు నుంచి ఆరు శాతం దాకా పెరిగాయి. డాలర్‌ క్షీణించడం వల్ల మెటల్స్‌కు మద్దతు అందింది. నిన్నటి నుంచి సిమెంట్‌ షేర్ల హవా కొనసాగుతోంది. నాలుగు శాతంపైగా పెరగడంతో పేటీఎం రూ. 500 దాటింది. గ్లాండ్‌ ఫార్మాలో ఇవాళ కూడా ఒత్తిడి రావడంతో ఈ షేర్‌ రెండు శాతం నష్టపోయింది.