For Money

Business News

గుత్తాధిపత్యం దేశానికి మంచిది కాదు

దేశ ఆర్థిక అభివృద్ధికి పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు ముఖ్యమే గాని… గుత్తాధిపత్యం మంచిది కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ అన్నారు. ఇవాళ ఆయన భారత్‌ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో కలిసి నడిచారు. ఆ తరవాత దేశ ఆర్థిక పరిస్థితి ఇద్దరూ చర్చించిన వీడియోను ఇపుడు కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. వచ్చే ఏడాది అంటే 2023 భారత్‌కే గాక ప్రపంచానికి ఆర్థికంగా క్లిష్టమైన ఏడాది అని రాజన్‌ అన్నారు. ద్రవ్యోల్బణ కట్టడి చాలా కష్టమైన పని అని ఆయన అన్నారు. కేవలం వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కష్టమని ఆయన అన్నారు. ఎందుకు అలా జరుగుతుందని రాహుల్‌ ప్రశ్నించగా… ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అన్నారు. చాలా ఏళ్ళుగా దేశ ఆర్థిక పరిస్థితి బాగా లేదని.. కరోనాతో మరింత కష్టాల పెరిగాయని అన్నారు. కరోనాకు ముందు జీడీపీ వృద్ధిరేటు 9 శాతం నుంచి 5 శాతానికి పడిన విషయాన్ని రాజన్‌ ప్రస్తావించారు. క్రిప్టో కరెన్సీతో పాటు ఇంకా పలు అంశాలలై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. దీన్ని వీడియోలో చూడగలరు.