For Money

Business News

రూ. 10,000 కోట్లతో ఈవీ ప్లాంట్‌

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ పూణెలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. దీని కోసం రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక పథకం కింద ఈ ప్లాంట్‌కు ఆమోదం లభించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అభివృద్ధి, ఉత్పత్తిపై దృష్టి సారించేందుకు కంపెనీ ఓ ప్రత్యేక అనుబంధ సంస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే.