For Money

Business News

అనుకున్నట్లే అరశాతం పెంపు

అమెరికా కేంద్ర బ్యాంకు రాత్రి వడ్డీ రేట్లను అర శాతం పెంచింది. ఇప్పటి వరకు ప్రతి సమావేశంలో 0.75 శాతం చొప్పున వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకు.. ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. ఇప్పటి వరకు వడ్డీ రేట్లను అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆరు సార్లు పెంచింది. దీంతో ఈ ఏడాది ఆరంభంలో సున్నా ఉన్న వడ్డీ రేటు ఇపుడ 4.25-4.50 శాతానికి చేరింది. వచ్చే ఏడాది చివరి నాటికి మరో 0.75 శాతం మేర వడ్డీ రేట్లను పెంచుతామని పేర్కొంది. ఫెడ్‌ తాజా నిర్ణయంతో అమెరికాలో ఇక వడ్డీ రేట్ల పెంపు జోరు తగ్గినట్లే.