For Money

Business News

మాస్ట‌ర్‌కార్డ్‌తో తెలంగాణ ఒప్పందం..

ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ కంపెనీ మాస్టర్‌కార్డ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. డిజిట‌ల్ స్టేట్ పార్ట్‌నర్‌షిప్‌లో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. మాస్టర్‌కార్డ్ వీసీ, అధ్యక్షుడు మైఖేల్ ఫ్రోమెన్, మంత్రి కేటీఆర్ మ‌ధ్య దావోస్‌లో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ కంపెనీ మాస్టర్‌కార్డ్‌తో జరిగిన ఒప్పంద భాగ‌స్వామ్యంతో.. ప్రపంచ స్థాయిలో సేవలు అందించ‌నున్నట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్విటర్‌లో వెల్లడించారు. మాస్టర్‌కార్డ్‌తో రాష్ట్రంలో పౌర సేవ‌ల‌ను అత్యంత వేగంగా డిజిటలైజ్‌ చేయ‌వ‌చ్చని ఆయన అన్నారు. చిన్న, మ‌ధ్య త‌ర‌హా వ్యాపారాల‌పై ఫోక‌స్ పెట్టడంతో పాటు రైతులకు కూడా డిజిట‌ల్ సేవ‌ల‌ను అందించ‌వ‌చ్చని మంత్రి త‌న ట్వీట్‌లో తెలిపారు.