For Money

Business News

తెలంగాణలో హ్యుండాయ్‌ రూ.1,400 కోట్ల పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన రాష్ట్రంలో పెట్టుబడులపై హ్యుండాయ్‌ గ్రూప్ చర్చించింది. చర్చల తరవాత తెలంగాణలో రూ. 1,400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. కేటీఆర్‌తో హ్యుండాయ్‌ సీఐఓ యంగ్చో చి (YoungCho Chi) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా హ్యుండాయ్‌ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. ఈ పెట్టుబడితో తమ కంపెనీ టెస్ట్ ట్రాక్‌లతో పాటు ఎకో సిస్టమ్ అవసరం అయిన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మొబిలిటీ రంగానికి హ్యుండాయ్‌ పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా ఒక మొబిలిటీ వ్యాలీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఇందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చిన హ్యుండాయ్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.