For Money

Business News

కియా బాస్‌… ఇక తెలంగాణలో

హ్యుందాయ్‌, కియా… ఒక దేశానికి చెందినవే కాని.. బయటివారికి ఈ రెండు కంపెనీలు భిన్నమైనవి. వేరే గ్రూప్‌ కంపెనీలని అనుకుంటారు. కాని రెండు కంపెనీల యజమాని ఒకరే. ఖాయిలా పడిన కియాను హ్యుందాయ్‌ టేకోవర్ చేసి అభివృద్ధి చేసింది. ఈ రెండు కంపెనీలకు కార్లు, పార్ట్‌లు.. అన్నీ ఒకే తయారీ కేంద్రం నుంచి వస్తాయి. కాని బయట మార్కెట్‌లో రెండు ప్రత్యర్థి కంపెనీలుగా పోటీ పడుతాయి. చెన్నై కేంద్రంగా హ్యుందాయ్‌ ఎప్పటి నుంచో పనిచేస్తోంది. చంద్రబాబు హయాంలో ఏపీకి వచ్చింది.. తన అనుబంధ సంస్థ ద్వారా. అదే కియా మోటార్స్‌ ద్వారా. బెంగళూరు వంటి అంతర్జాతీయ నగరం దగ్గర ఉండటం, మరో మెట్రో చెన్నై దగ్గరగా ఉండటంతో పాటు చెన్నై, కృష్ణపట్నం పోర్టులు దగ్గరగా ఉండటంతో చెన్నైలో హ్యుండాయ్‌, ఏపీలో కియా విస్తరించాలని భావించాయి. మారిన రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా హ్యుందాయ్ తెలంగాణలో రూ.1400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తమిళనాడు, ఏపీని కాదని హైదరాబాద్‌కు రప్పించడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సక్సెస్‌ అయ్యారు. ఎన్నో ఆశలతో ఏపీలో అడుగు పెట్టిన కియా… ఉన్నచోటే ఆగిపోయింది. ఇప్పటి వరకు విస్తరణ ఊసు లేదు. ఇపుడున్న పరిస్థితుల్లో విస్తరణకు కియా సిద్ధపడుతుందా? అందుకు హ్యుందాయ్‌ అంగీకరిస్తుందా అనేది చూడాలి. హ్యుందాయ్‌ను ఏపీకి రప్పించడంలో అక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే చెన్నై ఏపీ చాలా అనువుగా ఉంటుందని కియాను ఏపీలో పెట్టింది హ్యుందాయ్‌. ముఖ్యంగా బెంగళూరు దగ్గరగా ఉందని. ఇపుడు హైదరాబాద్‌ను ఎంచుకుంది.