రూ. 993 పెరిగిన గ్యాస్ ధర
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం భారీగా పెంచింది. యుద్ధం తరవాత క్రమంగా ధరలు పెంచుతున్న కేంద్రం… ఒకేసారి 19 కిలోల సిలిండర్ ధరను రూ. 993 పెంచింది. దీంతో ఢిల్లీ సిలిండర్ ధర రూ. 3071కి పెరగ్గా, హైదరాబాద్‌లో రూ. 3069కి చేరింది. దేశంలోని దాదాపు ప్రధాన నగరాల్లో ధరలు ఇలానే ఉన్నాయి. పాట్నాలో మాత్రం గ్యాస్ ధర సిలిండర్‌కు రూ. 1002 పెంచారు. యుద్ధం మొదలైన తరవాత మార్చిలో రూ. 144, ఏప్రిల్ 1న రూ. 200 మేర కమర్షియల్ గ్యాస్ ధరను పెంచారు. గృహ అవసరాలకు వాడే గ్యాస్ ధరను మాత్రం పెంచలేదు.
