క్రూడ్ బూస్ట్?
మార్కెట్ ఇవాళ లాభాలతో ప్రారంభం కానుంది. గిఫ్టి నిఫ్టి 160 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ క్రూడ్ 108 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవాళ్టి నుంచి హర్ముజ్ జల సంధి ద్వారా తటస్థ నౌకల ప్రయాణానికి తాము సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. నౌకల రవాణాకు తాము రక్షణగా ఉంటామని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్‌కు 24 గంటల డెడ్‌లైన్‌ను ఇచ్చారు ట్రంప్. లేదంటే భారీ దాడులు తప్పవన్నారు. మరోవైపు ఇవాళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. దీని ప్రభావం కూడా మార్కెట్‌పై ఎలా ఉంటుందో చూడాలి. క్రూడ్ ధరలు తగ్గడం వల్ల నిఫ్టి లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇవాళ ఫలితాలకు కూడా కొన్న ప్రధాన కంపెనీలు స్పందించనున్నాయి. ముఖ్యంగా కొటక్ మహీంద్రా పాజిటివ్‌గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది.
