For Money

Business News

ల్యాంకో రుణాలను దారి మళ్ళించింది

ల్యాంక్‌ గ్రూప్‌నకు చెందిన ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ కంపెనీ తమ నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్ళించిందని ఇండియన్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. నాన్ పెర్ఫామింగ్‌ అకౌంట్లకు సంబంధించిన మొత్తాలకు తాము ప్రావిజినింగ్‌ చేసినట్లు పేర్కొంది. ల్యాంకో ఇన్‌ఫ్రా రుణ ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటించింది. ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ తమ నుంచి రూ. 577.47 కోట్ల రుణం తీసుకుందని, ఈ మొత్తం రుణాలను దారి మళ్లించిందని ఇండియన్‌ బ్యాంక్‌ తేల్చింది. ఈ మొత్తానికి పూర్తిగా ప్రావిజినింగ్‌ చేసినట్లు పేర్కొంది. ఈ కంపెనీతో పాటు కోల్‌కతాకు చెందిన బసుంధర గ్రీన్‌ పవర్‌ అనే కంపెనీ కూడా రూ. 11.64 కోట్లను తప్పుడు పత్రాలతో ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నట్టు పేర్కొంది. ఈ కంపెనీ ఎన్‌పీఏకు నూరు శాతం కేటాయింపులు జరిపినట్టు తెలిపింది.