For Money

Business News

దక్షిణాదికి హ్యాండిచ్చిన రిలయన్స్‌ జియో

రేపటి నుంచి దేశంలో 5జీ సేవలను రిలయన్స్‌ జియో ప్రారంభిస్తోంది. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతో పాటు ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసిలో రేపటి నుంచి ‘ట్రూ 5 జీ’ పేరుతో సేవలను ప్రారంభిస్తోంది. దక్షిణాది నుంచి ఒక్క నగరం కూడా లేకపోవడం విచిత్రం. కనీసం మెట్రో నగరమైన చెనైలో కూడా జియో 5జీ సేవలను రేపు ప్రారంభించడం లేదు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ప్రయోగాత్మకంగా అంటే బేటా ట్రయల్స్‌ రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 1 జీపీఎస్‌ స్పీడ్స్‌ వరకు అన్‌లిమిటెడ్‌ 5జీ సర్వీస్‌ను జియో ఆఫర్‌ చేయనుంది. 5జీ సర్వీస్‌ అందించే ఇతర నగరాలను తరవాత ప్రకటిస్తామని రిలయన్స్‌ జియో ప్రకటించింది. ఇపుడు రిలయన్స్‌ జియో కనెక్షన్‌ ఉన్న వినియోగదారుడి వద్ద 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే ఆటోమేటిగ్గా… 5జీ సర్వీస్‌లోకి మారిపోతారని… ప్రత్యేకంగా మరో సిమ్‌ కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదని జియో పేర్కొంది.