For Money

Business News

జీ- సోనీ విలీనానికి సీసీఐ ఓకే.. కానీ

జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజస్‌, సోని పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. అయితే కొన్ని షరతులను విధించినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ విలీనం వల్ల మార్కెట్‌లో విలీన కంపెనీకి గుత్తాధిపత్యం లభిస్తుందని, అయితే మున్ముందు దీన్ని దుర్వినియోగం చేయకూడని సీసీఐ తన ఉత్తర్వులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ రెండు కంపెనీల విలీనంపై సీసీఐ అభ్యంరం వ్యక్తం చేసింది. విలీనం వల్ల మార్కెట్‌లో ఈ కంపెనీకి గుత్తాధిపత్యం లభిస్తుందని నెల రోజుల క్రితం సీసీఐ పేర్కొంది. ఈలోగా ఈ రెండు కంపెనీల ప్రతినిధులతో సీసీఐ అధికారులు చర్చలు కూడా జరిపారు. ఈ విలీనానికి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ఇది వరకే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. విలీన ఆమోదానికి సంబంధించిన సమాచారం మార్కెట్‌కు ముందే తెలిసినట్లు ఉంది. జీ ఎంటర్‌టైన్మెంట్‌ షేర్‌ ఇవాళ 7 శాతంపైగా పెరిగి రూ. 269.90 వద్ద ముగిసింది. అంతకుముందు రూ. 271.50ని కూడా తాకింది. ఇది 52 వారాల గరిష్ఠ స్థాయి.