For Money

Business News

భారత జీడీపీ వృద్ధి రేటులో కోత

భారత్‌ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాల్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) తగ్గించింది. 2022 సంవత్సరంలో భారత జీడీపీ 9 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసిన ఐఎంఎఫ్‌ ఇపుడు ఆ అంచనాను 8.2 శాతానికి తగ్గించింది. భారత్‌ వృద్ధి మందగిస్తున్నా… ప్రపంచంలో వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. ఇది చైనా అంచనా వృద్ధి 4.4 శాతానికి దాదాపు రెట్టింపు. అయితే కోవిడ్‌ సమయంలో భారత జీడీపీ వృద్ధి రేటు భారీగా క్షీణించింది. దీంతో ఏ కాస్త పెరిగినా భారీగా అనిపిస్తోంది. అదే చైనా జీడీపీ కరోనా సమయంలో కూడా తగ్గలేదు. స్థిరంగా ముందుకు సాగుతోంది. మరోవైపు ప్రపంచ ఆర్థిక వృద్ధి మాత్రం నిస్తేజంగా ఉంటుందని పేర్కొంది. 2021లో 6.1 శాతం పెరిగిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022లో 3.6 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.