For Money

Business News

మొదలైన రుణ రేట్లు బాదుడు

ఎస్బీఐ తరవాత అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ద్రవ్యల్బోణాన్ని అడ్డుకట్ట వేస్తానని చెప్పిన ఆర్బీఐ గత క్రెడిట్‌ పాలసీ సమయంలో వడ్డీ రేట్ల జోలికి పోలేదు. కాని పరిస్థితి విషమిస్తున్న విషయాన్ని గుర్తించిన బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేట్‌ (MCLR) ను ఎస్‌బీఐ తొలుత పెంచగా, ప్రైవేట్‌ బ్యాంక్‌లైన కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు రుణ రేట్లను ఇపుడు పెంచాయి. ఈ రెండు ప్రైవేట్‌ బ్యాంక్‌లు వాటి ఎంసీఎల్‌ఆర్‌ను 0.05 శాతం చొప్పున పెంచాయి. ఇప్పటికే ఎస్బీఐ 0.01 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఆఫ్‌ బరోడా సైతం ఎంసీఎల్‌ఆర్‌ను 0.05 శాతం పెంచింది.
ఎంసీఎల్‌ఆర్‌ అంటే..
ఎంసీఎల్‌ఆర్‌ లేదా మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేట్‌ అనేది ఆయా బ్యాంక్‌ల బెంచ్‌ మార్క్‌ (కనీస) వడ్డీ రేటు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అంతకంటే తక్కువ రేటుపై రుణాల్ని కస్టమర్లకు ఇవ్వరాదు. అలాగే ఏ రుణాలకైనా అదే కనిష్ఠ వడ్డీ రేటుగా ఉంటుంది. వివిధ వ్యయాలను కలపి బ్యాంకులు అధిక వడ్డీ వసూలు చేస్తాయి.