For Money

Business News

ఆకర్షణీయ లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

ఇన్నాళ్ళూ డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ పెరిగాయని… అందుకే నాస్‌డాక్‌ పడిందని విశ్లేషకులు చెబుతూ వచ్చారు. ఇవాళ కూడా పదేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ నాలుగేళ్ళ గరిష్ఠ స్థాయి 2.9 శాతానికి చేరాయి, డాలర్ కూడా పెరిగింది. కాని అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. ఆంరభంలో ఒక శాతంపైగా నష్టపోయిన జర్మనీ డాక్స్‌తోపాటు ప్రధాన మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. ఇక వాల్‌స్ట్రీట్‌లో నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ, డౌజోన్స్‌ సూచీలు ఒక శాతంపైగా పెరిగాయి. ట్వీటర్‌ మినహా మిగిలిన ప్రధాన ఐటీ, టెక్‌ కంపెనీల షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఇవాళ క్రూడ్‌ నాలుగు శాతం వరకు క్షీణించడంతో మార్కెట్‌ మూడ్‌ మారిందేమో. చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో అనేక నగరాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో క్రూడ్‌ డిమాండ్‌ తగ్గొచ్చని వార్తలు వస్తున్నాయి. డాలర్‌ ఇండెక్స్ ఏక్షణమైనా 101ను దాటే అవకాశముంది. క్రూడ్‌తోపాటు మెటల్స్‌ అన్నీ పడ్డాయి. వెండి రెండు శాతంపైగా క్షీణించింది.