For Money

Business News

జియో ఫైబర్‌ బంపర్‌ ఆఫర్‌

తన పోస్ట్‌ పెయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో కొత్త జియోఫైబర్ ప్లాన్‌లను తెచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ బొనాంజా ఆఫర్‌లో భాగంగా ఇస్తోంది. ఈ ఆఫర్‌ కింద దాదాపు రూ. 10,000 విలువైన గేట్‌వే రూటర్, సెట్-టాప్ బాక్స్, ఇన్‌స్టాలేషన్‌ను ఉచితంగా అందిస్తుంది. దీంతో పాటు 14 OTT యాప్‌ల వరకు వినియోగదారులు తమకు నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. అయితే వారు ఎంపిక చేసుకున్న యాప్‌లను బట్టి రూ. 100 లేదా రూ. 200 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జియో ఫైబర్‌ ఈ ప్లాన్‌ కింద ఇస్తున్న యాప్‌లు ఇవి… డిస్నీ+ హాట్‌స్టార్, జీ5,సోనీ లివ్‌, వూట్‌, సన్‌ నెక్ట్స్‌, డిస్కవరీ ప్లస్‌, హోయ్‌చాయ్‌, ఆల్ట్ బాలాజ, ఎరోస్‌ నౌ, లయన్స్‌గేట్‌, షెమారూమి, యూనివర్సల్‌ ప్లస్‌, వూట్‌ కిడ్స్, జియో సినిమా.ఇప్పటికే ఉన్న జియో ఫైబర్‌ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు మైజియో యాప్‌లో తమ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ని ఎంచుకుని, కొత్త ప్లాన్‌కు అద్దెను ముందుగానే చెల్లించి… కొత్త ఆఫర్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.