For Money

Business News

అన్ని షేర్లలో చితక్కొట్టుడు

ఐటీ, టెక్నాలజీ, ఎకనామీ.. ఒకటేమిటి దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. పెద్ద ఐటీ, టెక్‌ కంపెనీలు నాలుగు శాతం దాకా క్షీణించాయంటే మార్కెట్‌లో పరిస్థితిని గమనించవచ్చు. నిన్న 2.75 శాతం, ఇవాళ మరో 3.5 శాతం వెరశి.. రెండు సెషన్స్‌లో నాస్‌డాక్‌ దాదాపు ఏడు శాతం క్షీణించింది. అలాగే ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా నిన్న ఇవాళ కలిపి ఆరు శాతం తగ్గింది. డౌజోన్స్‌దీ అదే పరిస్థితి. డౌజోన్స్‌ 2.56 శాతం క్షీణించిందంటే ఈక్విటీ మార్కెట్‌ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇవాళ వచ్చిన CPI డేటా మొత్తం మార్కెట్‌ మూడ్‌ను మార్చేసింది. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపులో మరింత జోరుగా ఉంటుందనే అంచనాలతో డాలర్‌ 0.95 శాతం పెరిగింది. డాలర్ ఇండెక్స్ ఇపుడు 104పైన ట్రేడవుతోంది. 10 ఏళ్ళ ట్రెజరీ బాండ్స్ ఈల్డ్స్‌ 4 శాతంపైగా పెరిగాయి. డాలర్ దెబ్బకు పలు మెటల్స్‌ ఘోరంగా దెబ్బతిన్నాయి. క్రూడ్‌ మాత్రం తగ్గినట్లే తగ్గి…122 డాలర్లపైనే ట్రేడవుతోంది.