For Money

Business News

పసిడి మెరిసెన్…

అమెరికాలో ద్రవ్యోల్బణ రేటు 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరడంతో ఈక్విటీ మార్కెట్‌లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఇన్వెస్టర్లు సరక్షిత మార్కెట్లవైపు పరుగులు తీస్తున్నారు. డాలర్‌ ఇండెక్స్‌ 104ని దాటడం, బాండ్‌ ఈల్డ్స్‌ అద్భుతంగా పెరగడంతో ఇన్వెస్టర్లు షేర్‌ మార్కెట్‌ నుంచి ఇతర రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బులియన్‌ పెరిగింది. అమెరికా మార్కెట్లలో బులియన్‌ స్వల్పంగానే పెరిగినా… డాలర్‌తో పాటు పెరగడం వల్ల మన మార్కెట్‌లో బులియన్‌ జిగేల్‌ మంది. స్పాట్‌ మార్కెట్లు రేపు ఉదయం ప్రారంభమౌతాయి. ఈలోగా ఫ్యూచర్స్‌ బంగారం, వెండి దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా పది గ్రామలు బంగారం ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో జూన్‌ కాంట్రాక్ట్‌రూ.716 పెరిగి రూ. 51,721కి చేరింది. ఇక వెండి కూడా రూ. 409 పెరిగి రూ. 61820 వద్ద ట్రేడవుతోంది. నిజానికి అమెరికా మార్కెట్లలో బంగారం 1.2 శాతం పెరగ్గా, వెండి కేవలం 0.6 శాతం మాత్రమే పెరిగింది. రేపు స్పాట్‌ మార్కెట్‌లో బులియన్‌ ధరలు భారీగా పెరగొచ్చు.