For Money

Business News

సుప్రీం కోర్టులో ఫ్యూచర్స్‌కు ఊరట

ఫ్యూచర్‌ గ్రూప్‌ ఆస్తులను అటాచ్‌ చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. నాలుగు వారాలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఫ్యూచర్‌ గ్రూప్‌, అమెజాన్‌ మధ్య గొడవ నడుస్తున్న సంగతి తెలిసింది. హైకోర్టు తీర్పు అమెజాన్‌కు అనుకూలంగా వచ్చింది. దీన్ని ఫ్యూచర్‌ గ్రూప్‌ సుప్రీంలో సవాలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతృత్వంలోని బెంచ్‌ ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న విచారణను నాలుగు వారాల పాటు నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోగా సెబీ లేదా సీసీఐ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ లోగా ట్రైబ్యూనల్‌ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.