For Money

Business News

9 కోట్లకు చేరిన డీమ్యాట్‌ అకౌంట్లు

స్టాక్‌ మార్కెట్‌లో రీటైల్‌ ఇన్వెస్టర్ల వాటా పెరుగుతోంది. రోజూ వేల సంఖ్యలో కొత్త ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్‌లోకి వస్తున్నారు. అకౌంట్లు ఓపెన్‌ చేయడమకాదు.. యాక్టివ్‌గా ట్రేడింగ్‌లో పాల్గొంటున్నారు. దీంతో దేశంలో యాక్టివ్‌ డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య భారీగా పెరిగింది. డిపాజిటరీల డేటా ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో డీమ్యాట్‌ అకౌంట్లు ఏకంగా 63 శాతం పెరిగి దాదాపు 9 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంక్‌ డిపాజిట్లతో పాటు ఇతర ఏ సాధనంపైనా సుమారు వడ్డీ రాకపోవడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లవైపు ఆకర్షితులవుతున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీడీఎస్‌ఎల్‌) నిర్వహణలోని యాక్టివ్‌ డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 6.3 కోట్లకు చేరుకుంది. ఆ ఖాతాల కస్టడీ ఆస్తుల (ఏయూసీ) మొత్తం విలువ 37.2 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌) నిర్వహణలోని యాక్టివ్‌ డీమ్యాట్‌ అకౌంట్లు 2.67 కోట్లకు పెరిగాయి. వాటిల్లోని ఏయూసీ విలువ రూ.301.87 లక్షల కోట్లుగా ఉంది. ఇపుడు మార్కెట్‌ కరెక్షన్‌ మోడ్‌లో ఉంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ జోరు కొనసాగుతుందా అనేది చూడాలి.