For Money

Business News

బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు రూ.1000 కోట్లు

దేశంలో బల్క్‌ డ్రగ్‌ పార్కుల ఏర్పాటు కోసం కేంద్రం మూడు రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది. ఈ పార్కు కోసం 13 రాష్ట్రాలు దరఖాస్తు చేయగా… ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది. దక్షిణాది నుంచి ఏపీని కేంద్రం ఎంపిక చేసింది. ఈ పార్క్‌ కోసం ఒక్కో రాష్ట్రానికి కేంద్రం రూ.1000 కోట్ల గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను అందిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 6940 కోట్లతో బల్క్‌ డ్రగ్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని 2020 ఆగస్టులో ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. దీని కోసం ఏపీ బల్క్‌ డ్రగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.