For Money

Business News

అంచనాలను దూరంగా జీడీపీ వృద్ధి రేటు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థూల జాతీయ వృద్ధి రేటు (జీడీపీ) 13.5 శాతంగా నమోదు చేసినట్లు నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఓ) పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 20.1 శాతంగా ఉంది. నిజానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 15.2 శాతం ఉంటుందని రాయిటర్స్‌ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో ఆర్థికవేత్తలు అంచనా వేశారు. తాజా డేటా ఈ అంచనాలకన్నా తక్కువగా ఉంది. ప్రైవేట్‌ వినియోగం 26 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం.గత ఇదే త్రైమాసికం జీడీపీ వృద్ధి రేటు 4.1 శాతం మాత్రమే. బేస్‌ స్థాయి తక్కవగా ఉండటం, కోవిడ్‌ ఆంక్షలు తొలగడం వల్ల జీడీపీ వృద్ధి సానుకూలంగా ఉంది. అలాగే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి 15.7 శాతం వృద్ధి కనబరచొచ్చని అంచనా కట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో 16.2 శాతం మేర వృద్ధి నమోదు కావొచ్చని ఇటీవల ఐఎంఎఫ్‌ సమావేశంలో ఆర్‌బీఐ పేర్కొంది. రాయిటర్స్‌ 15.2 శాతం, బ్లూమ్‌బర్గ్‌ 15.3 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేశాయి.