For Money

Business News

నిన్న నష్టాలు… నేడు స్థిరంగా

నిన్న రాత్రి అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. దాదాపు ఒక శాతం నష్టపోయినా.. ఉదయం నుంచి అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్లో ఉన్నాయి. కాని ఇవాళ యూరో మార్కెట్లు ఒకశాతం వరకు నష్టంతో ఉన్నాయి. దీంతో వాల్‌స్ట్రీట్‌ కూడా నష్టాల్లో ప్రారంభమైంది. అయితే నష్టాలు 0.35శాతంలోపే ఉన్నాయి. నిన్న, ఇవాళ ముడి చమురు ధరలు భారీగా క్షీణించడంతో ఎనర్జి షేర్లు భారీగా నష్టపోయాయి. నిన్న 103 డాలర్ల వద్ద ఉన్న క్రూడ్‌ ఆయిల్‌ ఇవాళ 96 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నిన్న నాలుగు శాతంపైగా క్షీణించిన క్రూడ్‌ ఇవాళ మరో రెండు శాతం దాకా నష్టంతో ఉంది. మరోవైపు డాలర్‌ స్వల్పంగా క్షీణించింది. నిన్న 109 పలికిన డాలర్‌ ఇండెక్స్‌ ఇవాళ 108.5 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు బులియన్‌ కూడా డల్‌గా ఉంది. బంగారం స్వల్ప నష్టంతో ట్రేడవుతుండగా, వెండి మాత్రం 2 శాతం దాకా నష్టపోయింది.