For Money

Business News

30,000 డాలర్ల దిగువకు బిట్‌ కాయిన్‌

కొద్దిసేపటి క్రితం అమెరికా కన్సూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ అంచనాలకు మించి పెరగడంతో క్రిప్టో కరెన్సీపై ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణం ఇంకా 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయి ప్రాంతంలో ఉండటంతో .. ఇన్వెస్టర్లు డాలర్‌ కరెన్సీ వైపు మొగ్గు చూపుతున్నారు. స్థిర ప్రతిఫలాలను ఇచ్చే బాండ్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 50 శాతంపైగా క్షీణించిన బిట్‌కాయిన్‌ ఇవాళ 30000 డాలర్లకు దిగువకు పడిపోయింది. ఒకదశలో 29,026 డాలర్లకు క్షీణించింది. బిట్ కాయిన్‌ 8 శాతంపైగా క్షీణించడంతో ఈథర్‌ కూడా 8 శాతం నష్టంతో 2160 డాలర్లకు పడిపోయింది. రిస్క్‌ అధికంగా ఉన్న సాధనాల నుంచి ఇన్వెస్టర్లు క్రమంగా వైదొలగుతున్నారు. మొత్తం క్రిప్టో కరెన్సీలు డల్‌గా ఉంటున్నాయి. బిట్‌కాయిన్‌ను 30,000 డాలర్ల స్థాయి అత్యంత కీలకం. మరి ఇవాళ ట్రేడింగ్‌ ముగిసే లోగా పుంజుకుంటుందా లేదా కొత్త కనిష్ఠానికి వెళుతుందా అనేది చూడాలి.