For Money

Business News

స్వల్పంగా తగ్గిన అమెరికా CPI

మార్కెట్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్ (CPI) డాటా ఏప్రిల్‌ నెలలో 0.3 శాతం పెరిగి 8.3 శాతానికి చేరింది. CPI సూచీ 8.1 శాతం ఉంటుదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయిలో ఉంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నందున ఫెడరల్‌ రిజర్వ్‌ మున్ముందు వడ్డీ రేట్లను భారీగా పెంచుతుందని స్టాక్‌ మార్కెట్‌ భయపడుతోంది. ఆహార, ఇంధన ధరలు భారీగా పెరిగినందునే ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని.. తాజా గణాంకాలతో భయపడాల్సిన పనిలేదని కొందరు అనలిస్టులు అంటున్నారు. CPI డేటా వచ్చిన వెంటనే డాలర్‌ ఇండెక్స్‌ 0.33 శాతం తగ్గి 103.59 వద్ద ట్రేడవుతోంది. ఇక క్రూడ్‌ ధరలు 4.5 శాతం పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఇపుడు 107 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.