For Money

Business News

రిలయన్స్‌ ఫలితాలు సూపర్‌..

2021 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో (క్యూ4) రిలయన్స్‌ ఇండస్ట్సీస్‌ రూ.1,72,095 కోట్ల ఆదాయంపై రూ.13,227 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 13.6 శాతం మాత్ర మే పెరిగినా, నికర లాభం మాత్రం రెండింతలు పెరిగింది. అమెరికా లో షేల్‌ గ్యాస్‌ ఆస్తులు అమ్మడం ద్వారా వచ్చిన రూ.797 కోట్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.6,348 కోట్లుగా ఉంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కంపెనీ రూ.5,39,238 కోట్ల ఆదాయంపై రూ.53,739 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే
రిలయన్స్‌ మొత్తం ఆదాయంలో రిటైల్‌, టెలికాం రంగాల వాటా 35 శాతం ఉండగా, 2021 మార్చి నాటికి 45 శాతానికి పెరిగింది. జవనరి-మార్చి మధ్యకాలంలో కొత్తగా 826 స్టోర్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో రిలయన్స్‌ రిటైల్‌ మొత్తం స్టోర్ల సంఖ్య 12,711కు చేరింది.