For Money

Business News

ఒక శాతం నష్టంతో నిఫ్టి ప్రారంభం

మార్కెట్‌ అంచనాలకు అనుగునంగా నిఫ్టి ఒక శాతం నష్టంతో ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 14,730ని తాకింది. తరవాత 14800ని దాటిని వెంటనే వచ్చిన అమ్మకాల ఒత్తిడితో నిఫ్టి ప్రస్తుతం 14,777 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లకు అనుగుణంగా మన నిఫ్టి కూడా ట్రేడవుతోంది. నిఫ్టికి 14730-14700 మధ్య మద్దతు వస్తుందని టెక్నికల్‌ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. డే ట్రేడర్స్‌ ఈ స్థాయిలో కొనుగోలు చేయొచ్చని, అయితే స్టాప్‌లాస్‌ మాత్రం 14680గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇది కేవలం డే ట్రేడర్స్‌ కోసమేనని… ఒక వేళ నిఫ్టి గనుక 14680 దిగువకు వెళితే.. నష్టంతో బయటపడటం వినా… మళ్ళీ ట్రేడ్‌ చేయొద్దని సలహా ఇస్తున్నారు. నిన్న మొన్న బాగా పెరిగిన బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లలో ఇపుడు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. నిఫ్టిలో 36 షేర్లు నష్టాలతో ట్రేడవుతుండగా, 12 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
విప్రో 504.85 3.06 బజాజ్‌ ఆటో 3,898.10 1.61
దివీస్‌ ల్యాబ్‌ 3,949.95 1.00
డాక్టర్‌ రెడ్డీస్‌ 5,152.25 0.98
ఓఎన్‌జీఈ 105.05 0.96

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1,431.60 -2.78
హెచ్‌డీఎఫ్‌సీ 2,486.00 -2.08
టైటాన్‌ 1,477.35 -1.95
ఐసీఐసీఐ బ్యాంక్‌ 609.70 -1.89
కొటక్‌ బ్యాంక్‌ 1,774.80 -1.67