For Money

Business News

టైటాన్‌ ఫలితాలు ఓకే

మార్చితో ముగిసిన టైటాన్‌ కంపెనీ పనితీరు పరవాలేదనిపించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 48 శాతం పెరిగి రూ 529 కోట్లకు చేరింది. అయితే మార్కెట్‌ మాత్రం కంపెనీ నుంచి రూ. 546 కోట్ల నికర లాభం ఆశించింది. కంపెని ఆదాయం కూడా 61 శాతం పెరిగి రూ. 7,135 కోట్లకు చేరింది. అయితే ఆదాయం మార్కెట్‌ అంచనాలకు (రూ. 6,932కోట్లు) కన్నా మెరుగ్గా ఉంది. షేర్‌కు రూ. 4 ఫైనల్‌ డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ ప్రతిపాదించింది. నగల డివిజన్‌ టర్నోవర్‌ 70 శాతం పెరిగింది. కంపెనీ పనితీరు ఈ స్థాయిలో అద్భుతంగా కన్పించడానికి కారణం… గత ఏడాది నికర లాభం చాలా తక్కువగా ఉండటం. కరోనా సంక్షోభంలో కంపెనీల ఆదాయం, నికర లాభం భారీగా క్షీణించింది. ఆ గణాంకాలతో పోలిస్తే కంపెనీ పనితీరు బాగా మెరుపడినట్లు తెలుస్తోంది. కాని 2019 ఏడాదితో పోలిస్తే అంతంత మాత్రమే.