For Money

Business News

ఈ స్టాప్‌లాస్‌తో నిఫ్టి కొనొచ్చు

నిఫ్టి ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 14,894. ఇవాళ నిఫ్టి గనుక 14,700 ప్రాంతానికి వస్తే 14,680 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని టెక్నికల్‌ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. స్టాప్‌లాస్‌ను బ్రేక్‌ చేస్తే ట్రేడింగ్‌కు దూరంగా ఉండటమే బెటర్‌ అని వీరు సలహా ఇస్తున్నారు. దిగువ స్థాయిలో నిఫ్టిని కొనుగోలు చేసినా…డే ట్రేడర్స్‌ స్వల్ప లాభాలకే బయట పడాలని వీరు సలహా ఇస్తున్నారు. పొజిషనల్‌ ట్రేడర్స్‌కు కూడా నిఫ్టి 14,680కి మద్దతుగా తీసుకుని ట్రేడ్‌ చేయాలని సూచిస్తున్నారు.