For Money

Business News

ప్రి ఓపెన్‌: సింగపూర్‌ నిఫ్టికి భారీ నష్టాలు

మే డెరివేటివ్ కాంట్రాక్ట్స్‌ భారీ నష్టాలతో ప్రారంభం కానున్నాయి. 12 సెషన్ల నష్టాలను నిన్న పూడ్చుకున్న నిఫ్టి… క్లోజింగ్‌ కల్లా 200 పాయింట్ల దాకా నష్టపోయింది. వరుసగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతూనే ఉన్నారు. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా… నాస్‌డాక్‌ చాలా బలహీనంగా ముగిసింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఉదయం వచ్చిన చైనా పారిశ్రామిక ఉత్పత్తి డేటా నిరుత్సాహంగా ఉండటంతో సూచీలు రెడ్‌లో ఉన్నాయి. ఏదశలోనూ కరోనా కేసులు తగ్గు ముఖం పట్టకపోవడంతో మన మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లు విముఖత చూపుతున్నారు. సింగపూర్‌ నిఫ్టి ప్రస్తుతం 150 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా ఇవాళ ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభం కానుంది.